: భారత అమ్ములపొదిలో చేరేందుకు సిద్ధమవుతున్న మరో అస్త్రం


స్వావలంబన దిశగా పయనిస్తున్న భారత్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరేందుకు సన్నద్ధమవుతోంది. దేశీయంగా రూపొందించిన లైట్ కంబాబ్ వెహికిల్ (ఎల్సీవీ) నావల్ వెర్షన్ యుద్ధ విమానం మరిన్ని పరీక్షలకు సిద్ధమవుతోంది. రన్ వే మీద ఇప్పటికే 25 టెస్ట్ ఫ్లయిట్స్ పూర్తి చేసుకున్న ఈ ఎల్సీవీ ఇక గోవాలోని నావల్ బేస్ లో మరికొన్ని పరీక్షలు ఎదుర్కోనుంది. వీటిల్లోనూ సత్తా చాటితో ఈ యుద్ధవిమానాన్ని నేవీలో ప్రవేశపెడతారు. దేశ రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు, డీఆర్డీవో డైరక్టర్ జనరల్ అవినాశ్ చందర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఈ విమాన పురోగతి సంతృప్తికరంగా సాగిందని తెలిపారు.

  • Loading...

More Telugu News