: ప్రియుడి కోసం అతని భార్యతో బేరమాడిన లేడీ హోంగార్డు


వివాహేతర సంబంధం నడిపిన ఓ వ్యక్తి ఇప్పుడు అంగట్లో సరుకులా తయారయ్యాడు. తమిళనాడులో మధురై సమీపంలోని నయనార్ పట్టి గ్రామంలో నాగరాజ్, వినోదిని దంపతులు నివసిస్తున్నారు. మధురైలో హోంగార్డుగా పనిచేస్తున్న పేచ్చియమ్మాళ్ తో నాగరాజ్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరి మధ్య సంబంధం నాగరాజ్ భార్యకు తెలిసింది. దీంతో, పేచ్చియమ్మాళ్ ను నిలదీసింది. అయితే, ఆ మహిళా హోంగార్డు తొణుకూబెణుకూ లేకుండా "రూ.10 లక్షలు ఇస్తాను, నీ భర్తను నాకు వదిలేయ్" అని చెప్పేసరికి వినోదిని నిర్ఘాంతపోయింది. ఆ హోంగార్డు తల్లిదండ్రులు కూడా ఇదే ప్రతిపాదన చేశారు. నాగరాజ్ భార్య అంగీకరించకపోయేసరికి ఆమెపై దాడికి దిగారు. దీనిపై వినోదిని తిరుమంగళం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News