: సుప్రీం న్యాయమూర్తిగా అమిత్ షా న్యాయవాది


బీజేపీ జాతీయ అధ్యక్షుడు, మోడీ విజయంలో కీలక భూమిక పోషించిన అమిత్ షా తరఫున పలు కేసులు వాదించడమే ప్రముఖ క్రిమినల్ లాయర్ ఉదయ్ యు లలిత్ కు బంపర్ ఆఫర్ వచ్చేలా చేసింది. అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే లలిత్ కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి దక్కింది. లలిత్ తో పాటు మరో ముగ్గురు న్యాయమూర్తులను కూడా సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తూ సుప్రీం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని కొలీజియం తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వారిలో లలిత్ ఆరో వ్యక్తి కానుండటం గమనార్హం. అమిత్ షా ఎదుర్కొన్న సోహ్రబుద్దీన్ షేక్, తులసీ రాం ప్రజాపతిల బూటకపు ఎన్ కౌంటర్ కేసులను ఆయన తరఫున లలితే కోర్టులో వాదించారు. 2 జీ స్ప్రెక్ట్రం కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానూ లలిత్ వ్యహరించారు. ఇదిలా ఉంటే, మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రహ్మణ్యం అభ్యర్థిత్వాన్ని కొలీజియం గత నెలలో తిరస్కరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News