: ఏరువాక సాగారో అన్నో చిన్నన్న...!
ఏరువాక సాగారో అన్నో చిన్నన్నో... అంటూ రైతులు హుషారుగా నారుమళ్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. వరుణదేవుడు ఊరించి ఊరించి ఎట్టకేలకు కరుణించడంతో రైతులు నారుమళ్లు వేసేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నారుమళ్ళు వేసుకోవడం ఇప్పటికే ఆలస్యం కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఏ గ్రామంలో చూసినా రైతులు పంట పొలాలను దుక్కిదున్నుకుంటూ, మడులను సిద్ధం చేసుకుంటూ కనిపిస్తున్నారు. మరికొన్ని చోట్ల విత్తనాలు జల్లుకుంటూ బిజీబిజీగా ఉన్నారు.