: పోలీస్ క్వార్టర్స్ లో దొంగతనం!!!
అదేంటి... పోలీస్ క్వార్టర్స్ లో దొంగతనం జరిగిందా? అని అనుకుంటున్నారా? ఇది నిజమేనండీ బాబూ. ఎంతోమంది పోలీసులు నివాసం ఉండే ప్రాంతంలోనే ఇది జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని టూటౌన్ పోలీస్ క్వార్టర్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ ఇంట్లో చొరబడిన చోరశిఖామణులు 11 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 15 వేల క్యాష్ అపహరించి సైలెంట్ గా మాయమయ్యారు.