: భారత్ తరఫున రికార్డులు నెలకొల్పిన భువనేశ్వర్, షమీ
నాటింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలిటెస్టులో భారత చివరి బ్యాట్స్ మెన్ భువనేశ్వర్, మొహమ్మద్ షమీలు తమ బ్యాటింగ్ సత్తా చాటారు. తాము బాల్ తోనే కాదు, బ్యాట్ తోనూ రాణించగలమని నిరూపించారు. ఈ జోడీ చివరి వికెట్ కు ఏకంగా 111 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరి బ్యాటింగ్ కు ఇప్పటివరకు భారత్ తరఫున నమోదైన కొన్ని రికార్డులు చెరిగిపోయాయి. అవేంటో చూద్దాం. * భారత్ తరఫున పదో వికెట్ కు ఇంగ్లండ్ లో అత్యధిక స్కోరు చేసిన జోడీ భువనేశ్వర్, షమీనే. * ఉపఖండం వెలుపల ఎక్కువ బంతులు ఎదుర్కొన్న ఆఖరి జంట వీరే. వీరిద్దరూ కలసి పదో వికెట్ కు 229 బంతులు ఎదుర్కొన్నారు. * చివరి వికెట్ కు అత్యధిక స్కోరు చేసిన రెండో జంట వీరు. ఈ రికార్డు సచిన్-జహీర్ (133 పరుగులు) పేరు మీద ఉంది.