: రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరో 24 నుంచి 48 గంటల్లో ఇది అల్పపీడనంగా మారనుంది. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు కూడా రెండు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రానున్న 24 గంటల్లో వాతావరణం మేఘావృతం అయి ఉండి గరిష్ఠంగా 33, కనిష్ఠంగా 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది.