: పోలవరంపై విప్ జారీ చేసిన బీజేపీ, టీడీపీ
పోలవరం ప్రాజెక్టుకు మోడీ సర్కార్ పూర్తిగా కట్టుబడి ఉంది. రాష్ట్ర విభజనకు తాము కూడా సహకారం అందించామనే భావనలో ఉన్న బీజేపీ... పోలవరంను పూర్తిచేసి ఆంధ్రప్రదేశ్ కు తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో, ఏపీ రాష్ట్రానికి సాగునీరు, తాగునీరు అందించే పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ క్రమంలో పోలవరం బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోను ఆమోదముద్ర వేయించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో, పోలవరం బిల్లు నేడు లోక్ సభలో చర్చకు రానున్న సందర్భంలో, బీజేపీ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. పోలవరం బిల్లుకు మద్దతు పలకాలని ఆదేశించింది. మరోవైపు బిల్లుకు మద్దతు తెలిపేలా టీడీపీ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది.