: నేడు పోలవరం బిల్లుపై చర్చ... దద్దరిల్లనున్న లోక్ సభ!


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లు ఈ రోజు లోక్ సభలో చర్చకు రానుంది. ఈ బిల్లును సాధించడానికి ఏపీ, అడ్డుకోవడానికి టీకాంగ్రెస్, టీఆర్ఎస్ ఎంపీలు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు లోక్ సభ దద్దరిల్లనుంది. ఈ క్రమంలో, ఈ బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలని తెలంగాణకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు వ్యూహరచన చేశారు. తెలంగాణ ఎంపీలకు ఒడిశాకు చెందిన బిజద, ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ ఎంపీలు మద్దతు పలుకుతున్నారు. నిన్న రాత్రి ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో వీరంతా భేటీ అయి, కార్యాచరణ రూపొందించారు. ఈ సమావేశానికి ఒడిశా, ఛత్తీస్ గఢ్ లకు చెందిన నలుగురు ఎంపీలు హాజరయ్యారు. అనంతరం, టీకాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయి, పోలవరం బిల్లును అడ్డుకుంటామని చెప్పారు. గిరిజనుల జీవితాలతో ఆడుకుంటే, వారు మావోయిస్టుల వైపు మొగ్గుచూపే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News