: ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ దాడులకు పాల్పడుతోంది: జగన్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన తరువాత వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు పెరిగిపోయాయని జగన్ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అమాయకులైన వైఎస్సార్సీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, మహిళా కార్యకర్తలపై టీడీపీ దాడులకు పాల్పడిందని అన్నారు. ఈ మేరకు టీడీపీ పాల్పడిన అక్రమాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని జగన్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలరోజుల్లోనే 17 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను టీడీపీ హతమార్చిందని ఆయన ఆరోపించారు. 119 మందిపై దాడి చేసి గాయపరిచిందని రాష్ట్రపతికి తెలిపామని ఆయన అన్నారు. టీడీపీ ఆగడాలపై గవర్నర్, రాష్ట్రపతి, ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేశామని జగన్ వెల్లడించారు. తమ ఆవేదనను రాష్ట్రపతి అర్ధం చేసుకున్నారని జగన్ తెలిపారు.

  • Loading...

More Telugu News