: రెండు అంశాలపై కేసీఆర్ కి లేఖ రాస్తా: బాబు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రెండు అంశాలపై లేఖ రాస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యా ప్రవేశాలపై లేఖ రాస్తానని అన్నారు. కాగా, 1956కు ముందున్న తెలంగాణ స్థానికులకు మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే.