: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో జగన్ భేటీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల్లో టీడీపీ అరాచకంగా వ్యవహరించిందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. జగన్ తో పాటు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. రాత్రి 7.30కి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో వైఎస్సార్సీపీ బృందం సమావేశం కానుంది.