: నెయ్ మార్ మళ్లీ వస్తున్నాడు


సెమీఫైనల్ మ్యాచ్ లో ఘోరపరాజయ భారంతో చితికిపోతున్న బ్రెజిల్ మూడో స్థానం కోసం జరుగుతున్న పోరాటంలో కాస్త ఊరట లభించింది. కొలంబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తీవ్రంగా గాయపడిన బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ ఆడనుండడం బ్రెజిల్ అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ప్లే ఆఫ్ లో భాగంగా శనివారం మూడో స్థానం కోసం నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ కు నెయ్‌మార్ అందుబాటులో ఉండనున్నాడని బ్రెజిల్ ఫుట్ బాల్ సమాఖ్య ధృవీకరించింది. కొలంబియా ఆటగాడు జాన్ ఢీకొట్టడంతో నెయ్ మార్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సెమీఫైనల్ లో జట్టు స్కూల్ స్థాయి ప్రదర్శన కనబర్చి ఘోరపరాజయం పాలవ్వడంతో పూర్తిగా కోలుకోకున్నా దేశ ప్రతిష్ట ముఖ్యమంటూ నెయ్ మార్ బరిలో దిగేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడని బ్రెజిల్ ఫుట్ బాల్ సమాఖ్య ప్రతినిధి రోడ్రిగో తెలిపారు. నెయ్ మార్ రావడంతో బ్రెజిల్ జట్టులో ఉత్సాహం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా ఆ మ్యాచ్ లో సిల్వా కూడా అందుబాటులో ఉండనున్నాడు. దీంతో మరో సారి బ్రెజిల్ జట్టు బలంగా తయారైంది.

  • Loading...

More Telugu News