: ఆనం వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఫైర్
హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వెనకేసుకొస్తోన్న ఆర్ధిక మంత్రి రామనారాయణ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. గనులశాఖ మంత్రిగా వ్యవహరించిన సమయంలో పలు వివాదాస్పద ఫైళ్ళపై సంతకాలు చేసేటప్పుడు సబితకు ఏమీ తెలియదని, వైఎస్ ఒత్తిడితోనే ఆమె అలా చేయాల్సి వచ్చిందని ఆనం సెలవిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఆమె నిర్దోషి అయితే అందుకు ఆధారాలను బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు. అలాకాని పక్షంలో మంత్రి వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు.