: రాష్ట్రపతికి ’నల్ల‘ కుబేరుల జాబితా


అక్రమార్జన ద్వారా కూడగడుతున్న నల్లధనాన్ని గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు తరలించి అక్కడి బ్యాంకుల్లో దాస్తున్న అక్రమార్కుల జాబితాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేసినట్లు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు. గురువారం రాష్ట్రపతిని కలిసిన సందర్భంగా ఈ నివేదికను అందజేసినట్లు ఆయన మీడియాకు తెలిపారు. తన వద్ద ఉన్న సమాచారం మేరకు నివేదిక తయారు చేసి రాష్ట్రపతికి అందించినట్లు స్వామి పేర్కొన్నారు. అంతేకాక తమిళనాడులో ఇటీవలి కాలంలో హత్యకు గురైన హిందూ నేతల గురించి కూడా ప్రస్తావించినట్లు స్వామి వెల్లడించారు. ఈ విషయంలో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News