: హాలీవుడ్ కంటే బాలీవుడ్ బాగుంది: నర్గీస్ ఫక్రీ


ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి... పద్యాన్ని సినీ నటులు బాగా అమలు చేస్తారు. సాధారణంగా ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చే హీరోయిన్లు తమకు దక్షిణాది తరువాతే బాలీవుడ్ అంటూ ఉంటారు. వారిని చూసి స్ఫూర్తి పొందిందో లేక నిజమే చెప్పిందో తెలియదు కానీ, బాలీవుడ్ హాట్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ హాలీవుడ్ కంటే బాలీవుడ్ బాగుంటుందని తెలిపింది. 'స్పై' సినిమాతో హాలీవుడ్ లో వెండితెరంగేట్రం చేసిన నర్గీస్ ఫక్రీ బాలీవుడ్ లోనే ఎక్కువ నేర్చుకున్నానని చెప్పింది. ఇక్కడే సౌకర్యవంతంగా ఉంటుందని, వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే పనిలో ఉన్నానని వెల్లడించింది. దేవుని ఆశీర్వాదం వల్లే తనకు పెద్దనటులతో నటించే అవకాశం వచ్చిందని, భాషా పరమైన సమస్యను ఎదుర్కోలేదని నర్గీస్ ఫక్రీ తెలిపింది.

  • Loading...

More Telugu News