: ఆదర్శ రైతుల స్థానంలో ఎంపీవోల నియామకం: మంత్రి పల్లె రఘునాథరెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29వేల మంది ఆదర్శ రైతుల స్థానంలో ఎంపీవోలను నియమించనున్నట్లు సమాచార, పౌర సంబంధాలు, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. పొరుగుసేవల విధానం ద్వారా ఎంపీవోల (రైతు సహాయకులు) నియామకం చేస్తామన్నారు. బీఎస్సీ అగ్రికల్చర్, హార్టీకల్చర్ చదవిన వారినే ఎంపీవోలుగా నియమిస్తామని చెప్పారు. ప్రతి వెయ్యి హెక్టార్లకు ఒక ఎంపీవో ఉంటారన్నారు. ఇక రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని, రైతు మిత్ర గ్రూపులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాకినాడలో ఎల్ఎన్ జీ టెర్మినల్ నిర్మాణానికి మంత్రివర్గం నిర్ణయించినట్టు వెల్లడించారు. ఆలస్యమవుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్ త్వరగా జరిపేలా చూస్తామన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని చెప్పారు.