: బడ్జెట్ బేషుగ్గా ఉంది: లార్డ్ స్వరాజ్ పాల్
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూపొందించిన బడ్జెట్ విదేశీ పెట్టుబడిదారులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని ఎన్నారై పారిశ్రామికవేత్త, కెపరో గ్రూప్ ఛైర్మన్ లార్డ్ స్వరాజ్ పాల్ అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా దేశం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చక్కని బాటను వేశారంటూ ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. పాల్ భారత్ లో స్టీల్, ఆటోమోటివ్ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టారు.