: మా బడ్జెట్టునే జైట్లీ కాపీ కొట్టారు: సోనియా
మోడీ సర్కారు గురువారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ మొత్తం యూపీఏ బడ్జెట్ కు అనుకరణగా సాగిందని ఆమె వ్యాఖ్యానించారు. జైట్లీ బడ్జెట్ లో యూపీఏకు చెందిన మెజార్టీ పథకాల కొనసాగింపే ప్రధాన భూమిక పోషించిందని కూడా ఆమె పేర్కొన్నారు. సామాజిక రంగానికి అసలు కేటాయింపులే లేవని పెదవి విరిచారు. ఇక, సంక్షేమ పథకాలకు పెద్దగా కేటాయింపులేమీ లేవని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే దుయ్యబట్టారు.