: మృదంగ విద్వాంసుడు ముళ్లపూడి శ్రీరామమూర్తి అస్తమయం


ప్రముఖ మృదంగ విద్వాంసుడు ముళ్లపూడి శ్రీరామమూర్తి గురువారం విశాఖలోని సీఎన్ఆర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొన్ని రోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరారు. దేశంలోని కర్ణాటక, హిందూస్తానీ సంగీతంలో పేరుగాంచిన ప్రముఖులందరికీ ముళ్లపూడి వాద్య సహకారం అందించారు. మద్రాసు మ్యూజిక్ అకాడెమీ, టిటికే పురస్కారం, విశాఖ మ్యూజిక్ అకాడెమీ, శ్రీపాద సన్యాసిరావు పురస్కారం తదితర పురస్కారాలను అందుకున్న శ్రీరామమూర్తిని, 'లయ జ్ఞానసాగర', 'మృదంగ సాగర' తదితర బిరుదులు కూడా వరించాయి. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో 1943 ఏప్రిల్ 8న జన్మించిన ముళ్లపూడి, 1965లో ఆకాశవాణిలో చేరారు. 1975-2002 వరకు విశాఖ ఆకాశవాణి నిలయ విద్వాంసుడిగా సేవలందించారు. 1966లో కొల్లూరు నాగమణితో వివాహమైన శ్రీరామమూర్తికి ఇద్దరు కుమారులున్నారు.

  • Loading...

More Telugu News