: నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఎన్నిక రికార్డు చేయాలని హైకోర్టు ఆదేశం
నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఈ నెల 5వ తేదీన గందరగోళ పరిస్థితుల నడుమ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 13న జరగనున్న ఈ ఎన్నిక ప్రక్రియను రికార్డ్ చేయాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది. ఈ మేరకు న్యాయవాది సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన కోర్టు, ఛైర్మన్ ఎన్నికకు పరిశీలకుడిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నిక స్వేచ్ఛగా, నిర్భయంగా నిర్వహించాలని సూచించింది. ఎన్నిక పూర్తయ్యాక వీడియో సీడీని తమకు సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది.