: ఆనం వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ కౌంటర్
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు జగన్ ను ఉరితీయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. అధికార మదం తలెకెక్కిన ఆనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండగా, పీసీసీ చీఫ్ బొత్స, మంత్రి పార్థసారథి అతనికి వంత పాడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఆరోపించారు. విచారణలో ఉన్న కేసు పట్ల వ్యాఖ్యానించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన మంత్రి ఆనంనే ముందు ఉరితీయాలన్నారు. ఆయనను తక్షణమే క్యాబినెట్ నుంచి తొలగించడమో, మెంటల్ హాస్పిటల్లో చేర్చడమో చేయాలని ఆయన డిమాండ్ చేశారు.