: తెలంగాణ బస్సులకు జీపీఎస్
తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఆధునికత సంతరించుకోనున్నాయి. ఆగస్టు చివరినాటికి ఈ బస్సుల్లో జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. మొత్తం 3,502 బస్సులకు ఈ సదుపాయం కల్పిస్తారు. అంతేగాకుండా, ప్రయాణికులకు బస్సు రాకపోకలపై ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందిస్తారు. బస్సుల షెడ్యూల్ తో కూడిన ఓ మొబైల్ యాప్ నూ రూపొందించనున్నారు. బస్ షెడ్యూళ్ళు రెండు నిమిషాలకోసారి అప్ డేట్ అయ్యేలా ఉద్దేశించిన ఓ వెబ్ పోర్టల్ ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది. హైదరాబాద్ ఇంటెలిజెంట్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ (హెచ్ఐటీఎస్) గా నామకరణం చేసుకోనున్న ఈ ప్రాజెక్టు కోసం రూ.17 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆధునికీకరణలో భాగంగా ప్రతి బస్సుకు ఓ జీపీఎస్ పరికరం, ఏంటెన్నా, జీపీఆర్ఎస్ పరికరం, కెమెరా అమర్చుతారు.