: కల నిజమైందంటున్న తమిళతంబి


ఇంగ్లండ్ పై సెంచరీ సాధించడం పట్ల టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ ఆనందం వ్యక్తం చేశాడు. కుక్ సేనతో ట్రెంట్ బ్రిడ్జిలో నిన్న ప్రారంభమైన తొలి టెస్టు మొదటిరోజున విజయ్ హవా కొనసాగింది. బంతిని మైదానం నలుమూలలకూ తరలించిన ఈ తమిళతంబి మొదటి రోజు ఆట చివరికి 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆట అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విదేశీగడ్డపై సెంచరీ కొట్టాలన్న కల ఈ ఇన్నింగ్స్ తో సాకారమైందని తెలిపాడు. ప్రాక్టీసు గేముల్లోనూ, నెట్స్ లోనూ బంతిని చక్కగా కనెక్ట్ చేశానని, అదే సానుకూల దృక్పథాన్ని ఇక్కడా ప్రదర్శించానని చెప్పుకొచ్చాడు. "జట్టుకు శుభారంభాన్నివ్వాలనుకున్నాను. పిచ్ అనుకూలించడం, బంతి చక్కగా బ్యాట్ పైకి వస్తుండడంతో పని సులువైంది. లంచ్ తర్వాత ఇంగ్లిష్ బౌలర్లు రివర్స్ స్వింగ్ ప్రయోగించినా, సమర్థంగా కాచుకున్నాం" అని వివరించాడు. కాగా, ఈ సెంచరీ విజయ్ ఖాతాలో నాలుగోది.

  • Loading...

More Telugu News