: మాటీవి దాడి ఘటనపై కేసు
టీవీ ఆర్టిస్టులు నిన్న మాటీవీపై చేసిన దాడిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. సెక్షన్ 147, 148, 149, 341,452,427 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బింగ్ సీరియల్స్ నిలిపివేయాలని డిమాండు చేస్తున్న ఆర్టిస్టులు ఆగ్రహంతో నిన్న మాటీవీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దాంతో కార్యాలయంలో కార్లు, ఫర్నీచర్ ధ్వంసమయిన సంగతి తెలిసిందే.