: రేపటికల్లా అల్పపీడనం... విస్తారంగా కురవనున్న వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే రుతుపవనాలు చురుగ్గా మారి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, రైతన్నలు కూడా తమ పనుల్లో బిజీ అయిపోయారు. తాజాగా పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత బలపడి రేపటికల్లా అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి.