: నెదర్లాండ్స్ షూట్ 'ఔట్'... 24 ఏళ్ల తర్వాత ఫైనల్లో అర్జెంటీనా


ఉత్కంఠభరితంగా కొనసాగిన సాకర్ ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో నెదర్లాండ్స్ పై అర్జెంటీనా జయకేతనం ఎగురవేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇరు జట్లు పట్టు వీడకుండా హోరాహోరీగా తలపడ్డాయి. ఇరు జట్ల డిఫెండర్లు చిరుతల్లా పోరాడారు. దీంతో, నిర్ణీత 90 నిమిషాల సమయంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఈ క్రమంలో, అదనపు సమయాన్ని కేటాయించారు. అయినా ఒక్క గోల్ కూడా కాలేదు. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమయింది. పెనాల్టీ షూట్ ఔట్ లో... అర్జెంటీనా తరపున మెస్సీ, గరాయ్, ఆగ్యురో, రోడ్రోగెయిజ్ గోల్స్ కొట్టారు. నెదర్లాండ్స్ తరపున రాబెన్, కుయుట్ గోల్స్ కొట్టడంలో సఫలీకృతం కాగా... వ్లార్, స్నైడర్ లు విఫలమయ్యారు. దీంతో, 4-2 గోల్స్ తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. 24 ఏళ్ల తర్వాత అర్జెంటీనా మరోసారి సాకర్ వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. పెనాల్టీ షూటౌట్లో నెదర్లాండ్స్ ఆటగాళ్లకు అడ్డుగోడలా నిలబడి... వారికి విజయం దక్కకుండా చేసిన అర్జెంటీనా గోల్ కీపర్ రోమెరోకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది.

  • Loading...

More Telugu News