: బీహార్ బీజేపీ నేత మరో వివాదంలో చిక్కుకున్నారు


ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీని విమర్శించే వారంతా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాల్సిందేనని హెచ్చరించిన బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ కిషోర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇంట్లో పట్టపగలు దొంగలు పడిన సంగతి తెలిసిందే. దీనిపై పోయిన వస్తువుల సంగతి పక్కన పెడితే పాట్నాలో పట్టపగలు ఎంపీ ఇంట్లో దొంగలు పడ్డారంటే శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పాట్నా పోలీసులు నలుగురు దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆ సొమ్ము గిరిరాజ్ ఇంట్లో దొంగిలించినదని వారు అంగీకరించారు. ఈ కోటి రూపాయల నగదుకు లెక్కా పత్రం లేకపోవడంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై గిరిరాజ్ మాట్లాడుతూ, ఆ నగదు తన కజిన్ సోదరుడికి చెందినదని, దానిపై పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని గిరిరాజ్ తెలిపారు.

  • Loading...

More Telugu News