: టీటీడీలో కులపెత్తనం రాజ్యమేలుతోంది: శోభారాజ్ ఆరోపణ
అన్నమయ్య సంకీర్తనల ఆలాపనలో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని సృష్టించుకున్న గాయని శోభారాజ్. పదకవితా పితామహుడి భావాలను నేల నలుచెరగులా చాటుతూ కోనేటిరాయుడికి నాద కైంకర్యం చేస్తోన్న ఈ కళాకారిణి నేడు తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కులవ్యవస్థ రాజ్యమేలుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. మూడున్నర దశాబ్దాలుగా వేంకటేశ్వరుడిని సేవించుకుంటున్న తనకు ఎస్వీబీసీ చానల్లో ఎందుకు అవకాశమివ్వరని శోభారాజ్ ప్రశ్నించారు. తనపట్ల టీటీడీ ధోరణి అర్థంకావడంలేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. కాగా, నేటి నుండి తన పేరును శోభాశ్రీనందకగా మార్చుకుంటున్నట్టు తెలిపారు.