: దురంతో ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు
ఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న హజ్రత్ నిజాముద్దీన్ (దురంతో) ఎక్స్ ప్రెస్ కాజీపేట నుంచి వరంగల్ కు వెళుతున్న సమయంలో వీల్ ట్రాలీ బ్రోకెన్ విరగడంతో.. శబ్దం వస్తుండడాన్ని ప్రయాణికులు గుర్తించారు. వెంటనే టీసీకి సమాచారం ఇవ్వగా, ఆయన వరంగల్ స్టేషన్ సూపరింటెండెంట్ కు సమాచారాన్ని చేరవేశారు. రైలును వరంగల్ స్టేషన్ లో గంటసేపు నిలిపివేసి, ఎస్ 6 బోగీ కింద వీల్ ట్రాలీ బ్రోకెన్ విరిగిందని గుర్తించారు. ఆ బోగీని తొలగించి రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రయాణికులు గుర్తించి చెప్పకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని వరంగల్ స్టేషన్ సూపరింటెండెంట్ జయకుమార్ చెప్పారు.