: తండ్రి, తాతను కాల్చేసిన బుడతడు
అమెరికాలో తుపాకీ సంస్కృతి పెరిగిపోతోందని నిపుణులు గగ్గోలు పెడుతున్నారు. తుపాకులను చిన్నారులకు దూరంగా ఉంచాలని సూచనలు కూడా చేస్తున్నారు. తుపాకులు అందుబాటులో ఉండడంతో టీనేజ్ లో ప్రవేశించగానే తుపాకీతో దాడులకు దిగుతున్నారు అక్కడి బాలలు. తాజాగా ఓ 11 ఏళ్ల బాలుడు తన తండ్రి, తాతపైనే కాల్పులకు దిగాడు. ఉత్తర కరోలినాలోని ఓ ఇంట్లో లాయిడ్ వుడ్ లీఫ్ (84) తన కుమారుడు లాయిడ్ పీటర్ వుడ్ లీఫ్ (49) ఇంట్లో ఉంటున్నాడు. ఇంట్లో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకోవడంతో పీటర్ వుడ్ లీఫ్ కుమారుడు (11) తుపాకీతో వారిద్దర్నీ కాల్చేశాడు. దీంతో లాయిడ్ వుడ్ లీఫ్ అక్కడికక్కడ మృతి చెందగా, పీటర్ లాయిడ్ వుడ్ లీఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల శబ్దాలు విన్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనాస్థలికి వెళ్లి ప్రాధమిక విచారణ చేశారు. అయితే దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.