: ఫరీదాబాద్ లో యువతిపై సామూహిక అత్యాచారం
ఫరీదాబాద్ లో 20 ఏళ్ల యువతిపై ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఓ వ్యక్తి బాధితురాలికి స్వయానా సోదరుడి వరుస కావడం గమనార్హం. భల్లార్ ఘర్ లోని ఆర్య నగర్ కు చెందిన 20 ఏళ్ల యువతి మార్కెట్ పనిపై ఇంటి నుంచి బయటకు రాగా అక్కడే కాపు కాసిన ఆమె సోదరుడు భూపేందర్, కూల్ డ్రింక్ తాగుదాం రమ్మంటూ పిలిచాడు. అయతే అందుకు స్పందించని యువతి ముందుకెళ్లగా, మరింత బలవంతపెట్టడంతో కాదనలేక అతడిచ్చిన కూల్ డ్రింక్ తాగింది. పథకం ప్రకారమే కూల్ డ్రింక్ లో మత్తు పదార్థం కలిపిన భూపేందర్, డ్రింక్ తాగగానే మత్తు ఆవహించిన యువతిని కారులో వేసుకుని సమీపంలోని ఓ హోటల్ కు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ తిష్ట వేసిన అతడి మరో ఇద్దరు స్నేహితులు మోతీ, దీపులతో కలిసి భూపేందర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై ఫిర్యాదునందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.