: అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖ: గంటా


విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నైట్ ప్యాకేజీ టూర్ బస్సును ఆయన బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి అండమాన్ వరకు పర్యాటక నౌకను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఆకాశంలో నుంచి విశాఖ అందాలను పర్యాటకులు వీక్షించేలా ప్రత్యేకంగా హెలికాఫ్టర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటక రంగంలో విశాఖకు ప్రత్యేక స్థానం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News