: రోజుకో ఆపిల్ తింటే...ఇక అందమైన సంసారమే!
ఆపిల్ తో చాలా లాభాలు ఉన్నాయని చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. రోజుకో ఆపిల్ పండు తింటే డాక్టర్ అవసరం రాదని వైద్యులు చెబుతారు. అలాంటి ఆపిల్ మహిళల్లో శృంగారోద్దీపనలు పెంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆపిల్ తిన్న ఆరోగ్యవంతమైన మహిళల్లో శృంగారోద్దీపనలు కచ్చితంగా పెరుగుతాయని ఇటలీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిశోధకులు 18 నుంచి 43 ఏళ్ల లోపు 731 మంది ఇటాలియన్ మహిళలపై ఈ పరిశోధన నిర్వహించారు. వీరికి ఫీమేల్ సెక్సువల్ ఫంక్షన్ ఇండెక్స్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు తీసుకున్నారు. ఆ తరువాత వారికి రోజుకు ఒకటి, రెండు ఆపిల్స్ ఇస్తూ వారి కోరికల స్థాయిని తెలుసుకున్నారు. దీంతో ఆపిల్ రోజూ తింటే మహిళల్లో శృంగారోద్దీపనలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.