: ఉస్మానియా పరిధిలో అంబేద్కర్ విద్యాపీఠం ఏర్పాటు


ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని పీజీ లా కాలేజ్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాపీఠం ఏర్పాటు చేయనున్నట్లు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ వినోద్ కుమార్ తెలిపారు. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 11 స్టడీ సెంటర్లను మంజూరు చేసిందని, అందులో భాగంగా హైదరాబాదులో విద్యాపీఠం ఏర్పాటవుతోందని ఆయన తెలిపారు. 1.74 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విద్యాపీఠం 11, 12 తేదీల్లో ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ సంజీవ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News