: ఇవి అలియా భట్ పై జోకులు...భలే ఉన్నాయే అన్న అలియా


‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ సినిమాతో రంగ ప్రవేశం చేసి ‘హైవే’, ‘2 స్టేట్స్’ సినిమాల ద్వారా తారాపథంలోకి దూసుకెళ్లిన యువతార అలియా భట్ జనరల్ నాలెడ్జ్ పై సామాజిక మాధ్యమాల్లో జోకులే జోకులు. 'కాఫీ విత్ కరణ్' షోలో మన ప్రధాని ఎవరు? అని అడిగిన ప్రశ్నకి 'పృధ్వీరాజ్ చవాన్' అంటూ అలియా సమాధానం చెప్పింది. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మపై జోకులే జోకులు. ఇంటర్నెట్ లో 'అలియా భట్ జోక్స్' అని టైప్ చేస్తే చాలు ఇబ్బడి ముబ్బడిగా దర్శనమిస్తాయి. ‘నా దగ్గర కారుంది, డబ్బుంది. నీ దగ్గరేముంది' అని అమితాబ్ బచ్చన్ అడిగితే, 'నా దగ్గర దిమాఖ్ ఉంది' అంటూ అలియా సమాధానం చెబుతుంది. 'నిజం చెప్పు' అని రాక్ కత్తి పట్టుకుని అడిగితే, 'నేను సరదాకి అన్నా' అంటుంది అలియా. ఇంకో చోట అర్జున్ కపూర్ తో మాట్లాడుతూ 'వాళ్లు నా జోకులు చూసి నవ్వుతున్నారు. నేను వారి బ్యాంకు బ్యాలెన్స్ లు చూసి నవ్వుతున్నాను' అని చెబుతుంది. ఇంతలో 'హే అలియా నీ అకౌంట్ హ్యాక్ అయింది' అని అర్జున్ చెబితే 'ఏ అకౌంట్' అని అడుగుతుంది. 'బ్యాంక్ అకౌంట్' అని చెబితే 'అవునా...! ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందేమోనని భయపడ్డా' అంటుంది. ఇలా జోకులే జోకులు! వీటిని చూసిన ఆలియా భలే ఉన్నాయి అంటూ మనసారా నవ్వుకుంది. పోన్లే ఇలా అయినా నేను అభిమానుల నోళ్లలో నానుతున్నానని ముచ్చటపడింది.

  • Loading...

More Telugu News