: సానియాకు గులాబీ ఇచ్చి ప్రపోజ్ చేశాడు!
టెన్నిస్ రాణి సానియా మీర్జాకు గులాబీ పువ్వునిచ్చి ప్రపోజ్ చేశాడు. అయితే, ప్రేమను ప్రతిపాదించింది ఎవరో కాదు... ఆమె భర్త షోయబ్ మాలిక్! తనకు గులాబీ పువ్వునిస్తున్న ఆ ఫోటోని సానియా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. షోయబ్ మోకాళ్లపై నిలబడి గులాబీని అందించగా, ఆమె అతడిని చూస్తూ మనసారా నవ్వుతూ ఉన్న ఆ ఫోటోకు ‘ప్రపోజల్ ఆఫ్టర్ ప్రపోజల్’ అని వ్యాఖ్యను కూడా జోడించింది. ఇప్పుడీ ఫోటో ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది. ఇటీవల ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్ లో సానియా టాప్ 5 ర్యాంక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.