: సప్లిమెంటరీ బడ్జెట్ లోనైనా మమ్మల్ని పట్టించుకోండి: సుబ్బిరామిరెడ్డి


రైల్వే అనుబంధ బడ్జెట్ (సప్లిమెంటరీ బడ్జెట్)లోనైనా తమకు న్యాయం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ సుబ్బిరామిరెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 18 ఏళ్లు ఎంపీగా ఉన్న తాను ఇంత నిస్సారమైన బడ్జెట్ ను చూడలేదని అన్నారు. రైల్వేబడ్జెట్ నిస్సారంగా, నిరాశాజనకంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 29 రైల్వే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. విశాఖ రైల్వే జోన్ డిమాండ్ ను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అనుబంధ బడ్జెట్ లోనైనా ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News