: నెల రోజుల టీఆర్ఎస్ పాలన అయోమయం, గందరగోళం: పొన్నాల
నెల రోజుల టీఆర్ఎస్ పాలన అయోమయం, గందరగోళమని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఒక సమస్యను పరిష్కరించేందుకు, ఇంకో సమస్యను సృష్టించాలా? అని ఆయన ప్రశ్నించారు. భూముల స్వాధీనం పేరుతో ప్రభుత్వం ప్రాధాన్యతాంశాలను వదిలేసిందని పొన్నాల అన్నారు. రైల్వే బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని పొన్నాల అభిప్రాయపడ్డారు. మంచి రోజులంటే ఛార్జీలను పెంచి ప్రయాణికులపై భారం వేయటమా? అని ఆయన ప్రశ్నించారు.