: ‘రైతు బంధు’ పథకం ద్వారా వడ్డీ లేని రుణం: హరీష్ రావు
‘రైతు బంధు’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ పథకం ద్వారా రైతులకు 6 నెలల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. మార్టిగేజ్ లేకుండానే రైతులకు రూ. 2 లక్షల వరకు రుణాన్ని ఇస్తామని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ యార్డుల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని హరీష్ రావు చెప్పారు. మార్కెట్ యార్డుల్లో ఈ-టెండరింగ్, ఈ-మార్కెటింగ్ విధానాలను ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.