: మాజీ ప్రేయసిపై మారడోనా ఆరోపణలు


అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనా (53) గేమ్ నుంచి రిటైరైనా ఫేమ్ కు కొదవలేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో మీడియాకెక్కడం మారడోనా స్టైల్. తాజాగా, తన మాజీ ప్రేయసి రోసియా ఒలీవియా (22) ఓ దొంగ అని ఆరోపిస్తున్నాడు. అంతేగాకుండా, ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒలీవియా తన డైమండ్ ఇయర్ రింగ్స్, వాచీలతో ఉడాయించిందని మారడోనా అంటున్నాడు. కాగా, ఆమెపై అంతర్జాతీయంగా అరెస్టు వారంట్ కోరుతున్నామని మారడోనా తరఫు అటార్నీ మథియాస్ మోర్లా చెప్పారు. మారడోనా, ఒలీవియా దుబాయ్ లో కొన్నాళ్ళపాటు కలిసి జీవించారు. ఒలీవియా కూడా సాకర్ క్రీడాకారిణే. రెండు వారాల క్రితం వీరిద్దరూ రియో డి జెనీరోలో కనిపించినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం.

  • Loading...

More Telugu News