: వ్యభిచారం కేసులో సినీ కో-ఆర్డినేటర్ అరెస్టు


హైదరాబాదులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఓ సినీ కో-ఆర్డినేటర్ తో పాటు మరో జూనియర్ ఆర్టిస్టును బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకృష్ణనగర్లో ఉండే కృష్ణ (సినీ కో-ఆర్డినేటర్), కె.వంశీ (జూనియర్ ఆర్టిస్టు) అనే వ్యక్తులు సినిమా చాన్సుల పేరిట కోస్తా జిల్లాల అమ్మాయిలకు వలవేసి వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. ఇప్పటికే వీరు చాలామంది అమ్మాయిలను మోసం చేశారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు పక్కా సమాచారంతో వ్యభిచార గృహంపై దాడిచేశారు. ఆ ఇద్దరు వంచకులను అరెస్టు చేసి, అక్కడే ఉన్న యువతిని రెస్క్యూ హోంకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News