: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా... ప్రకటించిన రాజ్ నాథ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పార్టీ నేత అమిత్ షా పేరును కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మీడియా ముఖంగా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా షాకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పార్టీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, మురళీ మనోహన్ జోసి, నితిన్ గడ్కరీ తదితర పలువురు అబినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ, గతంలో తప్పుడు ఆరోపణల కారణంగా నితిన్ గడ్కరీ తప్పుకోవటంతో తాను పార్టీ బాధ్యతలు స్వీకరించానన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయానికి తనదైన కృషి చేసిన షా, ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. అంతకుముందు గుజరాత్ లో ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న హయాంలో మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహించారు.