: స్పీకర్ ను కలసిన కాంగ్రెస్ ఎంపీలు... ప్రతిపక్ష హోదా తమకే ఇవ్వాలని విజ్ఞప్తి


లోక్ సభలో ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు కొద్దిసేపటి కిందట స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. సభలో ప్రతిపక్ష హోదా తమకే కల్పించాలని వారు కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని స్పీకర్ వారికి తెలిపారు. ప్రస్తుతం లోక్ సభలో 44 మంది సభ్యులున్న కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా అర్హత పొందాలంటే 50కి పైగా సభ్యులను కలిగి ఉండాలి.

  • Loading...

More Telugu News