: పబ్ లో యువతుల పట్ల బౌన్సర్ల అసభ్య ప్రవర్తన


హైదరాబాదులో మంగళవారం రాత్రి ఓ పబ్ లో యువతుల పట్ల బౌన్సర్లు అసభ్యంగా ప్రవర్తించారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం:1 లోని ఓ పబ్ వద్ద ఆ ఘటన చోటుచేసుకుంది. యువతుల వెంట వచ్చిన వారి స్నేహితుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్న బౌన్సర్లను అడ్డుకునే యత్నం చేయగా, అతడిపై బౌన్సర్లు మూకుమ్మడిగా దాడికి దిగారు. దీంతో ఆ యువకుడు గాయాలపాలయ్యాడు. దీనిని గమనించిన పబ్ యాజమాన్యం వెనువెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలో్కి దిగిన పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన బౌన్సర్లలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News