: ఢిల్లీలో మరో నిర్భయ ఘటన
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ మృగాళ్లు రెచ్చిపోయారు. షాపింగ్ మాల్ లో పనిచేసి ఇంటికెళుతున్న ఓ మహిళను నలుగురు దుర్మార్గులు అపహరించి, వేగంగా వెళుతున్న కారులోనే సామూహిక అత్యాచారం చేశారు. ఆపై నగర శివారులోని ఓ ఆస్పత్రి సమీపంలో రోడ్డుపై విసిరేసి పారిపోయారు. ఈ నలుగురు మృగాళ్లలో మహిళ బాయ్ ఫ్రెండ్ కూడా ఉండటం గమనార్హం. నలుగురు నిందితుల్లో ఓ దుర్మార్గుడు మైనరని పోలీసులు చెప్పారు. ఢిల్లీ శివారులోని ఘజియాబాద్ లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు నలుగురు నిందితుల పేర్లను పోలీసులకు వెల్లడించింది. వీరిపై గతంలో కూడా ఆ మహిళ, తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిందట. అయితే ఉత్తర ప్రదేశ్ పోలీసులు అప్పుడు లైట్ గా తీసుకున్నారు. దీంతో నిందితులు మళ్లీ మహిళపై విరుచుకుపడ్డారు. తొలిసారి ఫిర్యాదు చేసిన సమయంలోనే నిందితులపై చర్యలు తీసుకుని ఉండి ఉంటే, ప్రస్తుతం ఈ దారుణం జరిగి ఉండేది కాదని బాధితురాలి స్నేహితులు వాపోతున్నారు.