: గ్రామంపై ఏనుగుల దాడి, రైతు మృతి
నిన్న చిత్తూరు జిల్లా ప్రజలు, నేడు శ్రీకాకుళం జిల్లా వాసులు... అడవిలో ఉండాల్సిన ఏనుగులు తమ ఆవాస ప్రాంతాల సమీపంలోొకి వచ్చేసరికి వణికిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా హిర మండలం తాడలి గ్రామంపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో మురళి అనే రైతు మృత్యువాత పడ్డాడు. ఒక్కసారిగా ఏనుగులు గ్రామంపై విరుచుకుపడేసరికి ఇళ్లను వదిలేసి గ్రామస్థులు భయంతో పరుగులు పెట్టారు. అనంతరం గ్రామ సమీపంలోని పంట పొలాలపై పడ్డ ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. దీంతో పంట పొలాలన్నీ పూర్తిగా నాశనమైపోయాయి. ఏనుగుల దాడితో భీతావహులైన గ్రామస్థులు కాస్త తేరుకున్న మీదట అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు.