: తృణమూల్ ఎంపీల ఆందోళనతో లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా
లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. పార్టీ మహిళా ఎంపీ పట్ల బీజేపీ సభ్యులు అసభ్యంగా ప్రవర్తించారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర ఆందోళనకు దిగారు. సభ ప్రారంభం కాగానే స్పీకర్ వెల్ లోకి వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు, స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అలా ఇరవై నిమిషాల పాటు సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ వారించినా ఎంతకీ తృణమూల్ సభ్యులు వినలేదు. దాంతో, సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అటు, రాజ్యసభ అంతకుముందే పదిహేను నిమిషాల పాటు వాయిదా పడింది.