: మూసివేత దిశగా 100కు పైగా రిలయన్స్ ఫ్రెష్ లు


రిలయన్స్ గ్రూపు ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తున్న రిలయన్స్ ఫ్రెష్ ఔట్ లెట్లు వందకు పైగా మూత పడనున్నాయి. మూసివేత జాబితాలో ఉన్న ఈ ఔట్ లెట్ల నుంచి ఆశించిన ఆదాయం రానందునే సంస్థ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆర్భాటంగా ప్రారంభమైన రిలయన్స్ ఫ్రెష్ లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 550కి పైగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో అత్యంత ఖరీదైన ప్రాంతాలల్లోని ఔట్ లెట్లను మూసివేయాలని కంపెనీ తీర్మానించింది. రిలయన్స్ బాటలోనే మోర్ మార్కెట్ యాజమాన్యం ఆదిత్య బిర్లా గ్రూపు కూడా అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోని కొన్ని స్టోర్లను మూసివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వినికిడి.

  • Loading...

More Telugu News