: నేడు పార్లమెంటులో 'ఆర్ధిక సర్వే' ప్రవేశపెట్టనున్న జైట్లీ
రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు ఆర్ధిక సర్వే నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దేశ ఆర్ధిక స్థితిగతులపై సమాచారాన్ని ఈ సర్వే ద్వారా ఆయన సభికులకు వివరించనున్నారు. రేపటి బడ్జెట్ తీరుతెన్నులను ఈ సర్వే ద్వారా అంచనా వేయొచ్చని ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారు.